Ball Tampering: తెరపైకి కొత్త విషయాలు..! డేవిడ్ వార్నర్‌ మేనేజర్‌ సంచలన వ్యాఖ్యలు..

 

మూడేళ్ల కింద జరిగిన బాల్ టాంపరింగ్‌ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఇప్పుడు మరోసారి కుదిపేస్తోంది. నాటి ప్రధాన సూత్రధారి కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా తాను బంతికి ఉప్పుకాగితం రాయడం తమ బౌలర్లకు కూడా ముందే తెలుసన్నాడు. దాంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పుడు మరోసారి దానిపై విచారణ చేపట్టింది. అయితే, ఈ విషయంపై ఇంకా ఏదైనా కొత్త సమాచారం ఉంటే తెలియజేయాలని కూడా తమ ఆటగాళ్లను కోరింది.

మరోవైపు ఈ ఉదంతం జరిగిన సమయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, ప్రధాన సూత్రధారి కామెరూన్‌ను ఏడాది పాటు ఆటకు దూరం చేసింది. అయితే, ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని వార్నర్‌ మేనేజర్ జేమ్స్‌ ఎర్‌స్కైన్‌ తాజాగా విమర్శించాడు. ఆ ముగ్గురికీ శిక్ష వేసినప్పుడు.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కేసు గెలిచేవారన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో విచారణ సందర్భంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లందర్నీ విచారించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని జేమ్స్‌ అభిప్రాయపడ్డాడు.

, बिहार, मुजफ्फरपुर, पूर्वी चंपारण, कानपुर, दरभंगा, समस्तीपुर, नालंदा, पटना, मुजफ्फरपुर, जहानाबाद, पटना, नालंदा, अररिया, अरवल, औरंगाबाद, कटिहार, किशनगंज, कैमूर, खगड़िया, गया, गोपालगंज, जमुई, जहानाबाद, नवादा, पश्चिम चंपारण, पूर्णिया, पूर्वी चंपारण, बक्सर, बांका, बेगूसराय, भागलपुर, भोजपुर, मधुबनी, मधेपुरा, मुंगेर, रोहतास, लखीसराय, वैशाली, शिवहर, शेखपुरा, समस्तीपुर, सहरसा, सारण सीतामढ़ी, सीवान, सुपौल, बिहार, मुजफ्फरपुर, पूर्वी चंपारण, कानपुर, दरभंगा, समस्तीपुर, नालंदा, पटना, मुजफ्फरपुर, जहानाबाद, पटना, नालंदा, अररिया, अरवल, औरंगाबाद, कटिहार, किशनगंज, कैमूर, खगड़िया, गया, गोपालगंज, जमुई, जहानाबाद, नवादा, पश्चिम चंपारण, पूर्णिया, पूर्वी चंपारण, बक्सर, बांका, बेगूसराय, भागलपुर, भोजपुर, मधुबनी, मधेपुरा, मुंगेर, रोहतास, लखीसराय, वैशाली, शिवहर, शेखपुरा, समस्तीपुर, सहरसा, सारण सीतामढ़ी, सीवान, सुपौल,

Comments are closed.